ఆకివీడు నగర పంచాయతీ శివారులోని సిద్దాపురం రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డు ప్రజలకు నిత్యం నరకప్రాయంగా మారింది. రహదారి చెంతనే డంపింగ్ యార్డ్ ఉండడంతో వాహన రాకపోకలు సాగించే ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పంచాయతీలో సేకరించిన చెత్త అంతా అక్కడ వేయడంతో డంపింగ్ యార్డ్ కొండలను తలపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.