ఆకివీడు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో జోసఫ్ హాస్పిటల్ ఎదురుగా ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్సై సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 7,200 రూపాయల నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసినట్లు ఆకివీడు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.