దెందులూరు: వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 400 మంది వైసీపీ కార్యకర్తలు శుక్రవారం జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్, దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు జనసేన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.