రైతు ఖాతా నుంచి రూ. 6 లక్షలు కాజేత

81చూసినవారు
రైతు ఖాతా నుంచి రూ. 6 లక్షలు కాజేత
పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామానికి చెందిన రైతు వరాహావతారం తన పొలం విక్రయించగా వచ్చిన రూ. 8 లక్షలను బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఈ నెల 19న యూనియన్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు మోసగాళ్లు ఫోన్ చేసి పంపిన లింకు తెరవాలని చెప్పారు. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చిందని భావించిన రైతు లింక్ పై క్లిక్ చేయగా దఫాలుగా రూ. 6 లక్షలు డ్రా అయ్యాయి. బ్యాంకుకి వెళ్లి అడగ్గా వారి సూచనలతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్