అక్క చెల్లెమ్మలకు అండగా జగనన్న

749చూసినవారు
అక్క చెల్లెమ్మలకు అండగా జగనన్న
మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఉండి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ నరసింహారాజు పేర్కొన్నారు. శుక్రవారం ఉండి మార్కెట్ యార్డ్ నందు 12586 మంది స్వయం సహాయక పొదుపు మహిళలకు వైయస్ఆర్ ఆసరా పథకం మూడో విడత కింద మంజూరైన రూ.15, 30, 50, 094/- చెక్కును నరసింహారాజు, గోకరాజు రామరాజు అందజేశారు. ప్రజాసంకల్ప యాత్రలో పొదుపు మహిళల కష్టాలు నేరుగా తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా రుణం మాఫీ చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో ఉండి మండల జడ్పిటిసి, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షులు, స్టేట్ డైరెక్టర్లు, త్రి కమిటీ సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, మహిళా కార్యకర్తలు, నాయకులు మరియు వైయస్సార్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్