ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో మానవత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పెన్మెత్స రామకృష్ణంరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ. ముగ్గులు వేయటం ఒక కళ అని అన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.