కాళ్ళ మండలం సీసలి గ్రామంలో వెలసిన శ్రీ సాయిబాబా ఆలయములో స్వామివారు శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లవారిజాము నుండే భక్తులు ఉత్తర ద్వారంగా స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.