పెదవేగి గురుకుల పాఠశాలలో స్పోర్ట్స్ డే

68చూసినవారు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోను రాణించాలని పెదవేగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధ్యాన్‌చంద్ ఫోటోతో ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్