ఉంగుటూరు: చల్లాలమ్మ అమ్మవారి ఆలయంలో చండీ హోమం

65చూసినవారు
ఉంగుటూరు: చల్లాలమ్మ అమ్మవారి ఆలయంలో చండీ హోమం
దసరా ఉత్సవాల సందర్భంగా ఉంగుటూరు చల్లాలమ్మ అమ్మవారి దేవస్థానంలో.. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి చందు ఆధ్వర్యంలో సోమవారం చండీ హోమం పూజలు నిర్వహించారు. పుట్ట మట్టితో శివుడు విగ్రహం తయారుచేసి, వివిధ రకాల పళ్ళ రసాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు హోమాలు పూజలు తిలకించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సూరత్తులు శ్రీనివాస్త దితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్