ఉంగుటూరు మండలంలోని కైకరం హైస్కూల్లో బుధవారం రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను డీఈవో వెంకట లక్ష్మమ్మ ప్రారంభించారు. రెండు రోజులు పాటు జరిగే పోటీల్లో బాల బాలికల అండర్-14 విభాగంలో పోటీలు నిర్వహించనున్నారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి అలివేలు మంగతాయారు, నిర్వహణ అధ్యక్ష, కార్యదర్శులు గుళ్ల ప్రసాదరావు, నాగసుధలు పర్యవేక్షించారు. 40 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పోటీలు నిర్వహిస్తున్నారు.