అధ్వాన్నంగా కంసాలిగుంట - నల్లమాడు రోడ్డు

76చూసినవారు
అధ్వాన్నంగా కంసాలిగుంట - నల్లమాడు రోడ్డు
ఉంగుటూరు మండలంలో అక్కుపల్లి గోకవరం నుంచి కంసాలి గుంట మీదుగా నల్లమాడు వెళ్లే తారు రోడ్డు పెద్ద పెద్ద గోతులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు. గోతులు ఏర్పడి వర్షం నీటివల్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోందన్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల బస్సులు గోతుల్లో దిగబడిపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. తారు రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. మంగళవారం అధికారులకు వినతి అందించారు

సంబంధిత పోస్ట్