వీఆర్ఏల సంఘ మాజీ జిల్లా అధ్యక్షుడికి ఘన నివాళులు
అత్తిలి. వీఆర్ఏల సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు మీసాల కృష్ణమూర్తి ఆకస్మిక మరణానికి వీఆర్ఏల సంఘం పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. శనివారం వీఆర్ఏల సంఘం, సిఐటియు నాయకులు స్వయంగా కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి వీఆర్ఏల సంఘానికి అనేక సేవలు అందించారని జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు అన్నారు.