Feb 22, 2025, 02:02 IST/ముథోల్
ముథోల్
తానూర్: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
Feb 22, 2025, 02:02 IST
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం తానూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం ఉమ్రి (కె) గ్రామానికి చెందిన కదం దత్తురాం(51) చెనులో వ్యవసాయ పనుల కోసం కూలీలను తీసుకెళ్లారు. వారికి తాగు నీళ్లు తీసుకొచ్చేందుకు సమీపంలో ఉన్న చేనుకు వెళుతుండగా, ఓ రైతు తన పొలం చుట్టూ అడవి జంతువుల నుంచి రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.