Nov 10, 2024, 16:11 IST/
ఇబ్బందులు వస్తే MLA పదవికి రాజీనామా చేస్తా: KTR
Nov 10, 2024, 16:11 IST
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి 20 మంది నేత కార్మికులు చనిపోయారని కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న దంపతులు అమర్ - స్రవంతి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి మాట్లాడారు. 'సిరిసిల్లలో నేను ఎమ్మెల్యేగా ఉండటం నచ్చకుంటే, నేను ఉండటం వల్ల ఇక్కడ ఇబ్బందులు వస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మేము ప్రభుత్వంలో లేము కొన్ని కుటుంబాలను మాత్రమే ఆదుకోగలం' అని అన్నారు.