పాలకోడేరు: దుర్గమ్మ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం
పాలకోడేరు మండలం కొత్తపేట శ్రీ విజయ కనకదుర్గా అమ్మవారి ఆలయ వద్ద దసరా మహోత్సవాలు ముగింపు సందర్భంగా.. మంగళవారం అఖండ అన్న సమారాధన అత్యంత వైభవోపేతంగా జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.