పెదపాడు తహసిల్దార్ గా కృష్ణ జ్యోతి
ఏలూరు జిల్లా పెదపాడు మండల నూతన తహసీల్దార్ గా ఎ. కృష్ణ జ్యోతి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. మండలంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందజేస్తామన్నారు.