పెదపాడులో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, మండలంలో అన్ని గ్రామాల్లో పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సిపిఎం పెదపాడు శాఖా మహాసభ డిమాండ్ చేసింది. గురువారం స్థానిక నర్రా ఆంజనేయులు భవనంలో జరిగిన సిపిఎం శాఖా మహాసభ పలు ప్రజా సమస్యలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాలను, శాఖా కార్యదర్శి ఎన్నికను సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె. శ్రీనివాస్ ప్రకటించారు.