AP: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా ఏదో అంశంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 'రాష్ట్రంలో అధికారం మారి ఆరు నెలలు దాటింది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ల మనుషులే, కాకినాడ పోర్టులో కస్టమ్స్, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు? ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు?' అంటూ జగన్ ప్రశ్నించారు.