టీడీపీకి రాజీనామా చేస్తా.. కేశినేని సంచలన ప్రకటన

257068చూసినవారు
టీడీపీకి రాజీనామా చేస్తా.. కేశినేని సంచలన ప్రకటన
టీడీపీ ఎంపీ కేశినేని నాని శనివారం సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్వీకర్ ని కలిసి తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నేను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు నాయుడు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదనేది నా భావన అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరిలతో ఉన్న ఫోటోని షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్