ప్రియురాలి తండ్రిని హత్య చేసిన ప్రియుడు

53చూసినవారు
ప్రియురాలి తండ్రిని హత్య చేసిన ప్రియుడు
ఏపీలోని నెల్లూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమకు అభ్యంతరం చెబుతున్నాడని ప్రియురాలి తండ్రిని ప్రియుడు హత్య చేశాడు. నెల్లూరులోని శ్రీనివాస్ నగర్‌కు చెందిన మహబూబ్ బాషా కుమార్తెను సాదిక్ అనే వ్యక్తి కొద్ది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమను మహబూబ్ బాషా అంగీకరించకపోవడంతో సాదిక్ ఆగ్రహానికి గురై అతడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాషా అక్కడికక్కడే మరణించాడు. నిందితుడు సాదిక్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

సంబంధిత పోస్ట్