వైద్యరంగంలో చేసిన సేవలకు గానూ తెలంగాణకు చెందిన శ్రీ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి జీర్ణాశయ ప్రేగుల వైద్య నిపుణులు. ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్. విజయవాడలో ఇంటర్ పూర్తిచేశారు. కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్నారు. 2002 లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.