అల్లు అర్జున్ అరెస్టును ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రి రోజా ఖండించారు. 'నటీనటులు ప్రమోషన్ కోసం థియేటర్‌కు వెళ్లడం ఇండస్ట్రీ సంప్రదాయం. అల్లు అర్జున్ వెళ్లటం నేరమా? భద్రతనివ్వాల్సిన బాధ్యత పోలీసులది కాదా? పోలీసుల తీరు అనుమానాలకు దారితీస్తోంది' అని రోజా అన్నారు. మోహన్ బాబు, బన్నీ వివాదాల్లో ప్రభుత్వం తొందరపడిందని, గోదావరి పుష్కరాల్లో 20 మంది చనిపోతే పోలీసుల వైఫల్యమే కారణమన్నారని బొత్స గుర్తు చేశారు.