వరద సమయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. 'ఏడు పదుల వయస్సులో సీఎం చంద్రబాబు సహాయక చర్యల్లో పాల్గొంటున్న తీరును ప్రశంసించాలే కాని విమర్శించడం సరికాదు. నేను కనిపించడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు.. నేను బయటకు వస్తే అధికార యంత్రాంగం ఇబ్బందులు పడుతారనే రాలేదు. ఇది రాష్ట్ర సమస్య.. వైసీపీ నేతలు కూడా బయటకు వచ్చి సహాయం చేయాలి' అని అన్నారు.