ఏపీ మాజీ సీఎం జగన్ నితీశ్ సెంచరీపై స్పందించారు. 'ఆస్ట్రేలియాతో బాక్సిండ్ డే టెస్టులో బ్రిలియంట్ సెంచరీ సాధించిన తెలుగబ్బాయి నితీశ్ కుమార్ రెడ్డికి శుభాభినందనలు. భారత జట్టు కష్టాల్లో ఉన్న వేళ, ఫాలో ఆన్ గండం పొంచి ఉన్న సమయంలో జట్టు కోలుకోవడానికి తన వంతు కీలక పాత్ర పోషించాడు. ఇలాంటివే మరెన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఈ సెంచరీనే నాంది అనుకుంటున్నాను' అంటూ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.