వైఎస్సార్‌సీపీ ధర్నా వాయిదా

80చూసినవారు
వైఎస్సార్‌సీపీ ధర్నా వాయిదా
ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ వాయిదా వేసింది. విద్యార్థులకు బాసటగా చేపట్టిన ఈ ధర్నాను జనవరి 29కి ఆ పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2,800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1,100 కోట్లు కలిసి మొత్తం రూ.3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్