AP: గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పై వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. తాము అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయామని ఆయన కార్యకర్తలతో అన్నారు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే, రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ సర్కార్ పరిస్థితేంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. రాబోయేది జగన్ 2.0 పాలన అని, 25-30 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.