అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియ కొత్తదేమీ కాదు. గడిచిన 15 ఏళ్లలో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా.. 2019లో గరిష్ఠంగా 2042 మందిని తిరిగి పంపించిందన్నారు. 2025లో ఇప్పటివరకు 104 మందిని పంపినట్లు మంత్రి వెల్లడించారు.