78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద గురువారం ఆర్యవైశ్య సభ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా పతాకావిష్కరణ చేశారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షులు మల్లెంకొండు సుబ్రహ్మణ్యం పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.