కడప వై-జంక్షన్ లో బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. గురువారం బొమ్మన ఫౌండేషన్ వ్యవస్థపాక అధ్యక్షులు బొమ్మన సుబ్బారాయుడు, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు విజయ్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి గణపయ్యను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం వల్ల ప్రకృతి కాలుష్యం కాదన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను వినియోగించాలని సూచించారు.