బ్రహ్మంగారిమఠం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్రం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారిమఠం టౌన్ ఐదు రోడ్ల కూడలిలో విద్యార్థులతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు కలివెల రాజశేఖర్ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు రమేష్, మండల నాయకులు అరవింద్, దేవకుమార్ పాల్గొన్నారు.