ప్రొద్దుటూరులో మంగళవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ఆర్టీపీపీ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. ఏపీ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ ఆర్టీపీపీ అధ్యక్షుడు గంగయ్య, కార్యదర్శి పుల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీపీపీలో 1, 500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో ఐటీఐ, డిగ్రీ విద్యార్హతతో పనిచేస్తున్న ఆన్ స్కిల్ వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.