ఎస్ఐ, ఏఎస్ఐలపై చర్యలు తీసుకోవాలి

68చూసినవారు
ఎస్ఐ, ఏఎస్ఐలపై చర్యలు తీసుకోవాలి
తనను దూషించి, గాయపరచిన కల్లమల్ల ఎస్ఐ తిమోతి, ఏఎస్ఐ రమణలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్టీపీపీ జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఎ. అంకన్న కోరారు. ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు, తన భార్య ప్రియాంకకు మధ్య విభేదాలు ఉన్నాయని, తన భార్య ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఐ, ఏఎస్ఐలు స్టేషన్కు పిలిపించి కొట్టడంతో కాలి చిటికెన వేలు ఎముక విరిగిందని వాపోయాడు.

సంబంధిత పోస్ట్