మెడికల్ సీట్లను రాష్ట్ర ప్రభుత్వం వద్దనడం విడ్డూరంగా ఉందని ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. బుధవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ. పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన 50 మెడికల్ సీట్లను ఎన్ఎంసీకి తాము నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం రాయలసీమ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేయడమే అన్నారు. వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.