పులివెందులలో వైద్యుల నిరసన

61చూసినవారు
కోల్ కతాలో విద్యార్థిని మోబినా అత్యాచారానికి
గురై హత్య సంఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం పులివెందులలోని డాక్టర్ వైయస్ఆర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాల వైద్యులు, వైద్య సిబ్బంది
శనివారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్