AP: గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన నేడు యలమంచిలి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.1.18 కోట్లతో చేపట్టిన పంటకాల్వలు, రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందని తెలిపారు.