వైసీపీ నేత అనుమానాస్పద మృతి

72చూసినవారు
AP: వైసీపీ హయాంలో బైరెడ్డి సిద్ధార్థ టీమ్‌లో పని చేసిన తోపుదుర్తి మహేశ్ బాబు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనంతపురంలోని సోమదొడ్డి-నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్న రైల్వే పట్టాలపై వైసీపీ నేత తోపుదుర్తి మహేశ్ బాబు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాగా, గత కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరులకు వ్యతిరేకంగా మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇటీవల పరిటాల శ్రీరామ్‌ని కలిశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్