మలయాళంలో చిన్న సినిమాగా విడుదలైన 'రేఖా చిత్రం' మూవీ వసూళ్లలో దూసుకుపోతోంది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ ఐడెంటిటీ లాంటి స్టార్ కాస్ట్ సినిమా బరిలో ఉన్నప్పటికీ ప్రేక్షకులను అలరించింది. ఆసిఫ్ అలీ, అనేశ్వర రాజన్ జంటగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్టు అందుకుంది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జస్ట్ రూ.6 కోట్లు పెట్టి నిర్మించగా రూ.50 కోట్లను వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.