కొన్ని రోజుల క్రితం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. కేసు ఫైల్ చేసిన లేడీ కోరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ మొదటి సారి మీడియాతో మాట్లాడారు. 'జానీ మాస్టర్ నాలుగేళ్ల క్రితం వేధించినప్పుడు.. ఇప్పుడెందుకు కేసు పెట్టావని చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక అమ్మాయిని. అప్పుడు మైనర్‌ని కూడా. పలుకుబడి ఉన్న వ్యక్తితో పోరాడే శక్తి నాకు లేదు. నేను ఫైట్ చేయగలను అనుకున్నప్పుడే బయటకు వచ్చాను' అని చెప్పింది.