నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు

63చూసినవారు
నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 105.79 పాయింట్ల నష్టంతో 80,004.06 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 27.40 పాయింట్ల నష్టంతో 24,194.50 వద్ద స్థిరపడింది. అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్