గూగుల్‌లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్‌లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌కు కొద్ది వారాల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. లేఆఫ్‌నకు గురైన వారు కంపెనీలో ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ చెప్పినట్లు ఆంగ్ల వార్తా సంస్థ ఒకటి పేర్కొంది.