అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలో శనివారం రాత్రి 11 గంటలకు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో ఇద్దరు పురుషులు, ఓ మహిళ తుపాకీ గాయాలతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు. గుర్తుతెలియని షూటర్లు కాల్పులు జరిపినటట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.