డయేరియాతో ఆరుగురు గిరిజన చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డయేరియాతో ఆరుగురు గిరిజన చిన్నారులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ఇలాంటి లక్షణాలతో జిల్లా ఆసుపత్రిలో కనీసం ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారని ఓ అధికారి తెలిపారు. దీంతో డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.