ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అబూజ్మడ్ అడవుల్లో ఇవాళ పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పురుషులు కాగా, ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి మూడు మృతదేహాలతో పాటు ఒక ఏకే 47, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు సమాచారం.