అయోధ్యలో విద్యుదాఘాతంతో 5 కోతులు మృతి (వీడియో)
యూపీలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. అయోధ్యలోని రాంనగరిలో ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు కరెంట్ సరఫరా కావడంతో సోమవారం 5 కోతులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రమాదంపై అయోధ్యకు వచ్చిన భక్తులు, అక్కడి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.