గతేడాది కులాలు, వర్గాలపై తాను తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నటుడు పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. పవన్ కుటుంబ సభ్యులను దూషించినట్లు ఆయన అంగీకరించారు. తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని పోసాని వెల్లడించారు. సజ్జల రాసిచ్చిన స్క్రిప్టు మేరకే విమర్శలు చేశానని పోసాని చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో రైల్వేకోడూరు పోలీసులు పేర్కొన్నారు.