అమితాబ్‌కు ప్రభాస్ విషెస్
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఇవాళ 82 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అమితాబ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు. 'హ్యాపీ బర్త్‌డే సర్.. మీతో కలిసి వర్క్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా' అని పేర్కొన్నాడు.