యూజీసీ నెట్ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC) 2024 ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తాజాగా ప్రకటించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను రూపొందిస్తారు. ఇక, యూజీసీ నెట్ పరీక్షను ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4, 2024 వరకు నిర్వహించారు.