అక్టోబర్ 14 నుంచి గ్రూప్-1 హాల్ టికెట్లు

69చూసినవారు
అక్టోబర్ 14 నుంచి గ్రూప్-1 హాల్ టికెట్లు
తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. అక్టోబర్ 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తాజాగా తెలిపింది. ఈ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్