
గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో శాస్త్రవేత్తల పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ iip.res.in ద్వారా నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 9 ఖాళీలకు అభ్యర్థులు మే 5 లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సంబంధిత బ్రాంచ్లో M.E./M.Tech తో పాటు PhD పూర్తిచేసిన వారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 67,700 – రూ. 2,08,700 (లెవల్ 11) జీతం అందుతుంది.