మిషన్‌ భగీరధ పనులలో నాణ్యత పాటించాలి - మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అనితత

45చూసినవారు
మిషన్‌ భగీరధ పనులలో నాణ్యత పాటించాలి - మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అనితత
కోదాడ : పట్టణంలో సుమారు రూ. 60కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరధ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పట్టణలో 40 సంవత్సరాల భవిష్యత్తును ఉద్దేశించబడి చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోదాడ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వంటిపులి అనిత పేర్కొన్నారు. శనివారం పట్టణంలో కొనసాగుతున్న మిషన్‌ భగీరధ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భముగా మిషన్‌ భగీరధ అధికారులతో పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భముగా ఆమె క్షేత్రస్థాయిలో పనులను చూసి వారికి తగిన సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో 236 కిలోమిటర్ల దూరం వేయనున్న పనులలో ఫీడర్‌ మోయిన్‌ పైప్‌లైన్‌ 16 కిలో మీటర్లు వేయాల్సి ఉండగా దానితో 9 కిలోమీటర్లు పూర్తి అయ్యిందని, డిస్టిబ్యూషన్‌ పైపులైన్‌ పనులు అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. పట్టణాన్ని మొత్తం 11 జోన్లుగా విభజించి 7 ట్యాంకులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 40 సంవత్సరాలకు వచ్చే జనాభా ఆధారితంగా పట్టణానికి అవసరమైన లక్షాముప్పై వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మిషన్‌ భగీరధ పనులకు పట్టణ ప్రజలు సహాకరించాలని, త్వరలో ప్రతి ఇంటికి ఉచిత స్యచ్చమైన నీటిని అందించనున్నట్లు తెలిపారు. మిషన్‌ భగీరధ పనులతో రహాదారులపై ఏర్పడిన గుంతలను ఆమె అప్పటికప్పుడు దగ్గర ఉండి పూడ్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎంబీసీ అద్యక్షుడు వంటిపులి నాగరాజు, కౌన్సిలర్లు సోమగాని ఖాజాగౌడ్‌, కందరబోయిన వేలాద్రి, ఎంబీపీ నాయకులు తాడేపల్లి గోవిందరావు, వీరభద్రాచారి, ఉపేందర్‌, మిషన్‌ భగీరధ ప్రాజెక్టు మేనేజర్‌ చిట్టిబాబు, సీనియర్‌ ఇంజనీర్‌ ఆనందజీవన్‌, సైట్‌ ఇంజనీర్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్